సంక్రాంతి పండుగ దృష్ట్యా 7200 ప్రత్యేక బస్సు సర్వీసులు...! 1 d ago
ఏపీ: సంక్రాంతి పండుగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించుకుంది. ఆంధ్రాలోనే కాక ఇటు తెలంగాణ, ఇతర రాష్ట్రాలకి కూడా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. జనవరి 8 నుంచి మొదలుకుని 13 వరకు 3,900 బస్సులు నడుపుతారని, తిరిగి మళ్లీ 16 నుంచి 20 వరుకు 3,200 బస్సులు నడుపుతారని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని, ఒకేసారి రెండు వైపులా టిక్కెట్లను బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.